అమరవీరుల కుటుంబాలకు అక్షయ్ కుమార్ కానుక దీపావళి.!
- October 21, 2017
అమరవీరులైన సైనికుల కుటుంబాలను ఆదుకోవడంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఎప్పుడూ ముందుంటారు. వాళ్ల కుటుంబాలకు వీలైన సహాయం చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ ఏడాది దీపావళి సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ రేంజ్‌కు చెందిన దాదాపు 103 అమరవీరుల కుటుంబాల్లో ఆయన ఆనందం నింపారు. వారి కోసం చెక్కు పంపిస్తూ.. మనసుకు హత్తుకునే విధంగా ఓ ప్రత్యేక సందేశాన్ని పంపించారు. విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసులు, పారామిలటరీ బలగాలు, సైనికుల సమాచారాన్ని కొల్హాపూర్ అధికారులతో కలిసి సేకరించారు.
దాదాపు 103 మంది అమరవీరుల కుటుంబాలను ఎంపిక చేసి ఒక్కో కుటుంబానికి రూ.25వేల చెక్కును పంపించారు. దాంతో పాటు ఓ లేఖను, చిన్నారుల కోసం పుస్తకాలు, స్వీట్లు పంపించారు. 'దేశం కోసం ప్రాణత్యాగం చేస్తున్న సిబ్బంది కుటుంబసభ్యులైన మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. ఈ దీపావళి పండుగ నాడు మీ ప్రియమైన వారితో గడపలేకపోతున్నారని నాకు తెలుసు. కానీ మీరు ధైర్యంతో సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మీ కోసం మిఠాయిలు, చిన్నారుల కోసం పుస్తకాలు పంపిస్తున్నా. ప్రేమతో అంగీకరించండి' అని లేఖను కూడా అక్కీ పంపారు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







