నేడే జపాన్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

- October 21, 2017 , by Maagulf
నేడే జపాన్‌ పార్లమెంట్‌ ఎన్నికలు

జపాన్‌ పార్లమెంట్‌ దిగువసభకు ఆదివారం జరుగనున్న ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని షింజో అబే నేతృత్వంలోని అధికార పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా వున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ప్రచార సమయంలో నిర్వహించిన అనేక ఒపీనియన్‌ పోల్స్‌ సైతం అబే నేతృత్వం లోని అధికార కూటమి మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తుందన్న అంచనాలను వెలువరించాయి. అబే మూడు వారాల క్రితం దిగువ సభను రద్దు చేసి మెరుపు ఎన్నికలకు సిద్ధమైన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com