'మెర్సల్'లో ఆ డైలాగులను తొలగించనున్న ప్రొడ్యూసర్

- October 21, 2017 , by Maagulf
'మెర్సల్'లో ఆ డైలాగులను తొలగించనున్న ప్రొడ్యూసర్

తమిళ స్టార్ ఇళయదళపతి విజయ్ మూవీ 'మెర్సల్'లో వివాదాస్పద డైలాగులు పెద్ద ఎత్తున దుమారం సృష్టించాయి. ముఖ్యంగా జీఎస్టీ మీద బాంబుల్లాంటి డైలాగులు ఉండడంతో బీజేపీ తీవ్రంగా స్పందించింది. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీపై అభ్యంతరకర వ్యాఖ్యలు, సన్నివేశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు భగ్గుమన్న సంగతి తెలిసిందే.వాటిని వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేయడంతో ఇందుకు ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ అంగీకరించింది. జీ ఎస్టీ గురించి తప్పుదోవ పట్టించే డైలాగులు, సీన్లు తొలగించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. దీంతో ఈ చిత్రం పై తలెత్తిన వివాదం సద్దు మణగవచ్చు. ఏమైనా మెర్సల్ మూవీ దేశ వ్యాప్తంగా సంచలన చిత్రమే అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com