మద్యం ఫ్యాక్టరీ పై దాడి : ఇద్దరు ప్రవాసీయులు అరెస్ట్

- October 22, 2017 , by Maagulf
మద్యం ఫ్యాక్టరీ పై దాడి : ఇద్దరు ప్రవాసీయులు అరెస్ట్

కువైట్ : సాబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలోని ఒక మద్యం కర్మాగారాన్ని పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ లో  అధికారులు దాడులు జరిపి నిందితులను అరెస్టు చేశారు, ఆసియా దేశానికి చెందిన ఇరువురు ప్రవాసులు అరెస్టయ్యారు, మద్యంతో నింపిన 140 పీపాలు  మరియు మద్యం తయారీ కోసం ఉపయోగించే పరికరాలు స్వాధీనం చేసుకొన్నారు.. పబ్లిక్ భద్రత వ్యవహారాల సహాయ కార్యదర్శి  మేజర్ జనరల్ ఇబ్రహీం అల్-త్రారా ఈ సందర్భంగా మాట్లాడుతూ  సబహ్ అల్ అహ్మద్ ప్రాంతంలో ఇద్దరు ఆసియా ప్రవాసీయులు  మద్యం చేస్తున్నారనే సమాచారం అందిందని దీంతో వీరిని పెట్టుకొనేందుకు ఒక ప్ర్రత్యేక భద్రతా బృందం ఏర్పడింది. వచ్చిన సమాచారంను  నిర్ధారించుకొని , అవసరమైన చట్టబద్ధమైన చర్యలు తీసుకున్న తర్వాత, ఫ్యాక్టరీ పై  దాడి చేసి ఇద్దరు అనుమానితులను అదుపులోనికి తీసుకొని వారిని  అదుపులోనికి తీసుకొన్నట్లు ఆయన తెలిపారు. మద్యం తయారీ గురించి  ప్రశ్నించినప్పుడు, అనుమానితులు తాము స్థానికంగా తయారుచేసిన మద్యాన్ని తమ తమ కొనుగోలుదారులకు  8 నుంచి 10 కువైట్ దినార్ల ఖర్చుతో విక్రయించినట్లు నిందితులు  ఒప్పుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com