నైజీరియాలో ముగ్గురు మహిళల ఆత్మాహుతి దాడి
- October 23, 2017
నైజీరియాలో ముష్కరులు పేట్రేగిపోయారు. ముగ్గురు మహిళా దళ సభ్యులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందగా.. 16 మంది గాయపడ్డారు. మైదుగురి నగరంలోని ఓ రెస్టారెంట్ ఎదుట ఆదివారం రాత్రి 9.45 నిమిషాలకు ఓ మహిళ తనను తాను పేల్చేసుకుంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మరో ఇద్దరు మహిళలు తమను తాము పేల్చివేసుకున్నారు. ఆహారం కోసం రెస్టారెంట్ వద్ద పలువురు వేచిఉన్న సమయంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆప్రాంతమంతా రక్తసిక్తమైంది.
ఘటనాస్థలికి చేరుకున్న భద్రతాసిబ్బంది ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించాయి. బొకోహరం ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







