ఇరాన్ అణు ఒప్పందం అమలు జరుగుతుంది స్పష్టం చేసిన బ్రిటన్
- October 24, 2017
ఇరాన్ అణు ఒప్పందాన్ని ధృవీకరించరాదని అమెరికా నిర్ణయించినప్పటికీ ఒప్పందం అమలవుతుందని, అందులో ఎలాంటి సందేహం లేదని బ్రిటన్ తేల్చి చెప్పింది. బ్రిటన్ విదేశాంగ మంత్రి బోరిస్ జాన్సన్ సోమవారం విదేశీ వ్యవహారాలపై ప్రసంగిస్తూ, ఇరాన్, పశ్చిమ దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం మనుగడలో వుంటుందని స్పష్టం చేశారు. ఈ నెల ప్రారంభంలో ట్రంప్ దీనిపై స్పందిస్తూ ఇరాన్ అణు ఒప్పందానికి అనుగుణంగా వ్యవహరిస్తోందని లాంఛనంగా ధృవీకరించడా నికి నిరాకరించారు. టెహరాన్ ఒప్పందానికి అనుగుణంగానే నడుస్తోందని అంతర్జాతీయ ఇన్‌స్పెక్టర్లు ధృవీకరించినా ట్రంప్ అంగీకరించ లేదు. ఈ ఒప్పందం కింద టెహరాన్‌పై ఎత్తివేసిన ఆర్థిక ఆంక్షలను తిరిగి విధించడానికి అమెరికన్ కాంగ్రెస్‌కు ఇక 60 రోజులే గడువుంది. నిరాయుధీకరణ వ్యవహారాలపై అమెరికా రాయబారి రాబర్ట్ వూద్ సోమవారం మాట్లాడుతూ, సంయుక్త సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జెసిపిఓఎ) కింద తామిచ్చిన హామీలకు కట్టుబడి వుంటామని చెప్పారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







