ఈ నెల ఆఖరులో రిలీజ్ కాబోతున్న సినిమాల వివరాలు

- October 24, 2017 , by Maagulf
ఈ నెల ఆఖరులో రిలీజ్ కాబోతున్న సినిమాల వివరాలు

ఈ వారం మాస్ మహారాజ్ రవితేజ నటించిన రాజా ది గ్రేట్ మాత్రం రిలీజ్ అయ్యింది. సినిమాకి మొదటి రోజు నుంచి హిట్ టాక్ రావడంతో పాటు, సోలో రిలీజ్ కూడా కలసి రావడంతో, కలెక్షన్లు బాగా వస్తున్నాయి. కానీ ఈ శుక్రవారం మూడు సినిమాలు బరిలో దిగుతున్నాయి.

ఈ నెల 27న వస్తున్న మూడు చిత్రాల్లో ఉన్నది ఒక్కటే జిందగీ . రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాటి హీరోయిన్లు.  దేవీశ్రీ ప్రసాద్ సాంగ్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్  ఆకట్టుకుంటోంది. దీంతో ఈ సినిమా పాజిటివ్ బజ్  వస్తోంది.

ఇక ఇదే రోజున గోపిచంద్ ఆక్సిజన్ వస్తోంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో అను ఇమ్మానుయేల్, రాశీఖన్నా హీరోయిన్లు. జ్యోతికృష్ణ దర్శకుడు. ట్రైలర్ బాగానే మెప్పించింది. ఈ మూవీతో పాటు తమిళ హీరో విజయ్ నటించిన మెర్సల్, అదిరింది పేరుతో డబ్ అయ్యి రిలీజ్ అవుతోంది. ఒకే రోజు వస్తున్న ఈ మూడు సినిమాల్లో ఆడియన్స్ కి ఏ సినిమా కనెక్ట్ అవుతుందో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com