ఉగ్రవాదులను ఏరిపారేయండి పాక్‌కు అమెరికా విదేశాంగ మంత్రి టిల్లర్సన్ స్పష్టీకరణ
- October 25, 2017
పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలని ఆ దేశ నాయకత్వానికి అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ స్పష్టం చేశారు. పాక్‌లో మంగళవారం సుడిగాలి పర్యటన చేపట్టిన ఆయన.. ప్రధాని షాహిద్ ఖాకన్ అబ్బాసీ సహా పలువురు నేతలతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిపారు. ఉగ్రవాదుల ఏరివేతకు పాక్ మరింత కృషిచేయాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన సందేశాన్ని టిల్లర్సన్ పునరుద్ఘాటించారు. అఫ్గానిస్థాన్‌లో శాంతిస్థాపన, దక్షిణాసియాలో ఐఎస్‌ఐఎస్‌ను తుదముట్టించడం వంటి అంశాల్లో పాక్‌తో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. ఉగ్రసంస్థలకు పాక్ సురక్షిత స్థావరంగా నిలుస్తోందంటూ ట్రంప్ గత ఆగస్టులో వ్యాఖ్యానించిన నేపథ్యంలో అమెరికా, పాక్ మధ్య సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. వాటిని పునరుద్ధరించేందుకే టిల్లర్సన్ తాజా పర్యటన చేపట్టినట్లు తెలుస్తోంది.
భారత్ చేరుకున్న టిల్లర్సన్: పాక్ పర్యటనను ముగించుకున్న అనంతరం టిల్లర్సన్ నేరుగా దిల్లీ చేరుకున్నారు. మూడురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌లతో ఆయన సమావేశం కానున్నారు. భారత్-పసిఫిక్ ప్రాంత భద్రతలో సహకారంతోపాటు పలు రంగాల్లో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపర్చుకోవడంపై టిల్లర్సన్ దృష్టిసారిస్తారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







