మనోజ్ ద్విపాత్రాభినయం 'ఒక్కడు మిగిలాడు' నవంబర్ 10న విడుదల
- October 25, 2017
మంచు మనోజ్ ద్విపాత్రాభినయం చేసిన ఒక్కడు మిగిలాడు చిత్రం నవంబర్ 10న విడుదల కాబోతోంది. పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ ఈ సీ బ్యానర్ల పై ఎస్ ఎన్ రెడ్డి, లక్ష్మీకాంత్ ఎన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్ర విశేషాలను దర్శకుడు అజయ్ ఆండ్రూస్ నూతక్కి వివరించారు. 'ఈ చిత్రం లో 35 నిమిషాల పాటు సాగే సముద్ర ప్రయాణం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది.
కొత్త నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటాయి. బతుకు పోరాటంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులు హృదయాలను కదిలిస్తాయి. ఈ సన్నివేశాలు చిత్ర ద్వితీయార్థం లో వస్తాయి. ప్రథమార్ధంలో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయి. మనోజ్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని దర్శకుడు తెలిపారు. చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.
ఛాయాగ్రహణం వికే రామరాజు పనితనం, శివ నందిగాం నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్లస్ అవుతాయని అన్నారు. రెండు పాత్రల్లో మనోజ్ నటన అలరిస్తుంది. హీరోయిన్ అనీషా అంబ్రోస్, సుహాసిని మణిరత్నం, మిలింద్ గునాజీ, అజయ్, జెన్నిఫర్, రమేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్ పీఎస్ వర్మ, గ్రాఫిక్స్ శ్రీనివాసులు, పాటలు గురుచరణ్, రామదుర్గం మధుసూధన్.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







