అమెరికాలో యాక్సిడెంట్‌కు గురైన ఖమ్మం జిల్లా తెలుగు విద్యార్ధిని శ్రీలేఖ
- October 25, 2017
అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని రోడ్డు ప్రమాదానికి గురైంది. ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామానికి చెందిన కొల్లూరు శ్రీలేఖ మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లింది. న్యూయార్క్ లోని స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. కాలేజీ నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో శ్రీలేఖ తలకు బలమైన గాయాలు అయ్యాయి. శస్త్రచికిత్స చేసి ఐసీయూలో ఉంచారు. శ్రీలేఖ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు..
మరోవైపు శ్రీలేఖ తల్లిదండ్రులు కొల్లూరు సురేష్, సుమతిలు కొన్నిసంవత్సరాలుగా మధిరలోని ఆజాద్ రోడ్డులో నివాసముంటూ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నడుపుతున్నారు. ప్రమాదం జరిగిన విషయాన్ని అమెరికా అధికారులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. శ్రీలేఖకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని.. ఇండియన్ కౌన్సిల్ అధికారులకు విదేశాంగశాఖమంత్రి సుష్మా స్వరాజ్ సూచించారు. అమెరికాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా శ్రీలేఖకు అవసరమైన సాయాన్ని అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







