క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్కు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్
- October 26, 2017
చిన్న చిన్న పాత్రలు పోషించి ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ...ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చి, హీరోగా గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు. విజయ్ దేవరకొండకి పెళ్ళి చూపులు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన సినిమా అంతగా మెప్పించలేకపోయినా... రీసెంట్ గా వచ్చిన అర్జున్ రెడ్డితో భారీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకుని ప్రశంసలు అందుకున్నాడు విజయ్ దేవరకొండ.
అర్జున్ రెడ్డి విజయం తర్వాత, విజయ్ మాత్రం తొందరపడకుండా తనకు సెట్ అయ్యే కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో రెండు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మిస్తోన్న ఒక సినిమాతో పాటు, ఓ యువ దర్శకుడు తెరకెక్కిస్తోన్న ప్రయోగాత్మకమైన సినిమా చేస్తున్నాడు. లేటెస్ట్ గా ఓనమాలు - మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో ఒక సినిమాను చేయనున్నాడు విజయ్ దేవరకొండ.
విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్లో వచ్చే మూవీ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉంటుందట. వచ్చే ఏడాది విజయ్ విజయ్ దేవరకొండ ఆ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్ రామారావు ఆ సినిమాను నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈ మధ్య కాలంలో క్రాంతి మాధవ్ తీసిన ఉంగరాల రాంబాబు నిరాశపరచినా... విజయ్ దేవరకొండ మాత్రం క్రాంతి మాధవ్‌తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు.
తాజా వార్తలు
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!









