కువైట్‌లో ఈ ఆహారం నిషేధం : తిన్నా ...కొన్నా భారీ జరిమానా

- October 27, 2017 , by Maagulf
కువైట్‌లో ఈ ఆహారం నిషేధం : తిన్నా ...కొన్నా భారీ జరిమానా

కువైట్ :  ' చీకులున్నాయా ...చిప్స్ ఉన్నాయా ? నాటు కోడి లెగ్స్ ఉన్నాయా ?  అని కువైట్ లో పాట పాడినా శిక్షలు ..జరిమానాలు విధించేలా ఉన్నారు.  ప్రజల ఆరోగ్యం, వాతావరణ కాలుష్య కారకాలపై కువైట్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టింది.. ఇందులో భాగంగా కువైట్ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మాంసాహారాన్ని గ్రిల్ల్డ్ ఫ్రై లుగా మంటలపై  కాల్చేందుకు ఉపయోగించే పొయ్యిలపై నిషేధాన్ని విధించింది. కువైట్‌లో బీచ్‌లలో, బహిరంగ ప్రదేశాల్లో మాంసాహారాన్ని కాల్చేందుకు ఈ పొయ్యిలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా మాంసాహారాన్ని కాల్చే పొయ్యిల ద్వారా వాతావరణం కాలుష్యం అవుతోందని కువైట్ వాతావరణ, ప్రజారోగ్య శాఖ తేల్చిచెప్పింది. దేశంలో ఈ పొయ్యిలను వాడితే 10వేల కువైట్ దీనార్ల( 21 లక్షల 48వేల రూపాయలు) జరిమానా విధిస్తూ సంచలన ఉత్తర్వులను జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com