అవిభక్త కవలలు పట్ల సౌదీరాజు సాల్మాన్ ఔదార్యం

- October 27, 2017 , by Maagulf
అవిభక్త కవలలు పట్ల  సౌదీరాజు సాల్మాన్ ఔదార్యం

రియాద్: సౌదీఅరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ లోని మానవీయ కోణం పట్ల దెస విదేశాలలో ప్రజలు కీర్తిస్తున్నారు. మా రాజు గారి మనస్సు వెన్నని సౌదీఅరేబియా వాసులు వేనోళ్ళ పొగుడుతున్నారు.  ఆఫ్ఘనిస్తాన్‌లో గత ఆదివారం అవిభక్త కవలలు జన్మించారని, హాస్పిటల్లో తగిన వసతులులేవని తెలుసుకున్న సల్మాన్ వెంటనే స్పందించారు. పిల్లలిద్దరినీ గాజా నుంచి సౌదీ రాజధాని రియాద్‌కు తరలించాలని, కింగ్ అబ్ధుల్‌అజీజ్ మెడికల్ సెంటర్‌లో వైద్యమందించాలని ఆయన తన సిబ్బందికి ఆదేశించారు. ఆ పిల్లలిద్దరూ ఉదరం, పొత్తికడుపు కలసిపోయి .. కొన్ని అంతర్గత అవయవాలను పంచుకుని జన్మించడంతో  పిల్లలను వేరు చేయడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని కోరారు. వేరుచేయడానికి అవసరమైన పక్రియను ప్రారంభించాలని అధికారులకు ఆయన ఆదేశాలిచ్చారు. దీంతో పిల్లల తల్లితండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా గాజాలో పిల్లలు చికిత్స పొందుతున్న షిఫా హాస్పిటల్ వైద్యులు స్పందించారు. పిల్లల ఆరోగ్యపరిస్థితుల దృష్ట్యా ఇక్కడి హాస్పిటల్లో చికిత్స జరపలేకపోతున్నట్లు  , తగిన వసతులులేవని వివరిస్తూ తెలిపారు. వెంటనే స్పందించిన రాజు సల్మాన్ ఈ పిల్లలను వేరుచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించడంపై ప్రశంసలు వెలువడుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com