'బ్లూవేల్' జాతీయ సమస్య :సుప్రీమ్ కోర్ట్
- October 27, 2017
చిన్నారుల ప్రాణాలను బలిగొంటున్న 'బ్లూవేల్' ఆన్లైన్ గేమ్‌ను జాతీయ సమస్యగా సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఈ ప్రమాదకర గేమ్ అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. చిన్నారులు ఈ గేమ్ ఆడకుండా అవగాహన కల్పించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని దూరదర్శన్‌కు సూచించింది. రోజులో ప్రధాన సమయాన్ని (ప్రైమ్‌టైమ్) ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసేందుకు డీడీ సహా ఇతర ఛానళ్లు కేటాయించాలని పేర్కొంది.
ఇప్పటికే 'బ్లూవేల్' సమస్య గురించి నిపుణుల బృందం పరిశీలన జరుపుతోందని కేంద్రం సుప్రీం కోర్టుకు వివరించింది. ఈ సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. రష్యాలో పుట్టిన ఈ గేమ్ ఇప్పటికే పలువురు చిన్నారుల ప్రాణాలను బలిగొంది. గత కొన్ని నెలల వ్యవధిలో భారత్‌లో ఆరుగురు చిన్నారులు ఈ గేమ్ బారిన పడి ప్రాణాలు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 100 మంది మరణించారు. చిన్నారుల మరణాలపై స్పందించిన కేంద్రం ఇప్పటికే ఇంటర్నెట్ దిగ్గజాలైన ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థలకు ఈ లింకులను తొలగించాలని సూచించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు, పాఠశాలలు సైతం 'బ్లూవేల్' బారిన పడకుండా చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాయి.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







