జామ హల్వా
- October 27, 2017కావలసినవి: జామ పళ్లు 5, చక్కెర తగినంత, నిమ్మకాయ ఒకటి, మిఠాయి రంగు కొద్దిగా (ఇష్టమైన ఫుడ్ కలర్ ఏదైనా వేసుకోవచ్చు), నెయ్యి కొద్దిగా.
ఎలా చేయాలి
మెత్తగా అయ్యేవరకు జామపళ్లను నీళ్లలో ఉడికించాలి. ఆ నీళ్లను వంచేయాలి. పళ్లను మధ్యకు కోసి గింజల్ని తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ముద్దకి సమానమైన కొలతలో చక్కెర తీసుకుని రెండింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి సన్నటి మంట మీద ఆపకుండా కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరపడిన తర్వాత నిమ్మరసం, నెయ్యి వేసి కలపాలి. కొద్దిసేపటి తర్వాత మిఠాయి రంగు కూడా వేసి బాగా కలపాలి. బాణలిని కిందకి దించాక కూడా మిశ్రమం గట్టిపడే వరకు కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. నెయ్యి లేదా నూనెని పూసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి. తర్వాత అప్పడాల కర్రతో ఆ మిశ్రమాన్ని సరిసమానంగా ఒత్తి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వెరైటీ స్వీట్‌గా బాగుంటుంది.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్‌పోర్ట్‌లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్