దుబాయ్‌లో రజనీ 2.0 ఆడియోకు పోస్టర్ హైలెట్

- October 28, 2017 , by Maagulf
దుబాయ్‌లో రజనీ 2.0 ఆడియోకు పోస్టర్ హైలెట్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, అక్షయ్ కుమార్ విలన్‌గా తెరకెక్కుతున్న చిత్రం 2.ఓ. డైరెక్టర్ శంకర్ అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఈవెంట్ గత రాత్రి దుబాయ్‌లో జరిగింది. ఈ సినిమాలో మొత్తం 3 పాటలుండగా ...దుబాయ్ లో రెండు పాటలు రిలీజ్ చేశారు. ఐతే ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ప్రొమోషన్ కోసం చేసిన విన్యాసం అందర్ని అకట్టుకుంది. దాదాపు 10,000 ఫీట్ ఎత్తులో ముగ్గురు వ్యక్తులు స్కై డైవింగ్ చేస్తూ పోస్టర్ ను పట్టుకున్నారు. అక్కడ తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానిలో దుబాయ్ అందాలు వారు చేసిన విన్యాసం హైలెట్ గా నిలిచింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com