కష్టాల్లో భారత కుటుంబం, వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్

- October 28, 2017 , by Maagulf
కష్టాల్లో భారత కుటుంబం, వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్

ప్రపంచంలో భారతీయులు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారని తెలిసినా.. వెంటనే వారికి సాయమందించడంలో ముందుంటున్నారు భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్. తాజాగా, మలేషియాలో పాస్‌పోర్ట్ పోగొట్టుకుని ఇబ్బంది పడిన ఓ భారతీయ కుటుంబానికి సహాయం చేసి మరోసారి ప్రశంసలు అందుకున్నారు.

వారాంతం సందర్భంగా మలేషియాలో భారత దౌత్య కార్యాలయం మూసి ఉండటంతో పాస్‌పోర్టులు పోగొట్టుకున్న భారతీయ కుటుంబం ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమ కుటుంబం గురించి సుష్మాకు తెలియజేస్తూ మీరా రమేశ్ పటేల్ అనే మహిళ ఓ ట్వీట్ చేసింది.

ఆ ట్వీట్‌కు వెంటనే స్పందించిన సుష్మా స్వరాజ్... 'ఇది చాలా అత్యవసర విషయం.. దయచేసి దౌత్య కార్యాలయాన్ని తెరిచి భారతీయ కుటుంబానికి సహాయం చేయండి' అంటూ మలేషియాలోని భారత దౌత్య కార్యాలయాన్ని సుష్మా స్వరాజ్ ట్వీట్ ద్వారా ఆదేశించారు. కాగా, ఆ వెంటనే సదరు భారతీయ కుటుంబానికి సహాయం చేసి, సమస్యను పరిష్కరించినట్లుగా భారత దౌత్యకార్యాలయం నుంచి సమాధానం వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com