'ఫెస్టివల్ ఆఫ్ లైట్స్' లో పాల్గొన్న 'యు.ఏ.ఈ తెలంగాణ జాగృతి' శాఖ

- October 28, 2017 , by Maagulf

అబుధాబి: "మిడిల్ ఈస్ట్ లీడింగ్ టూరిస్ట్ అట్రాక్షన్ " మరియు ఫార్ములా రోసా ప్రపంచంలో అత్యంత వేగంగా రోలర్ కోస్టర్ కు కేంద్రమైన అబుదాబి ఫెరారీ వరల్డ్లో తేది 20/10/2017 నుండి 28/10/2017 వరకు ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అను పేరుతో నిర్వహించిన  ప్రతిష్టాత్మక  వినోదాత్మకమైన కార్యక్రమంలో యు.ఏ.ఈ తెలంగాణ జాగృతి శాఖ మన రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలను కలవోసి ఒక అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనను అంతర్జాతీయ వేదిక మీద వివిధ దేశాల నుండి వచ్చిన పర్యాటకుల సమక్షంలో తేది 27/10/2017 శుక్రవారం రోజున ప్రదర్శించడం జరిగింది . 

ఇంతటి మంచి అవకాశాన్ని తీసుకు రావడానికి సహకరించిన రాగం అరవింద్ బాబుని,గత పదిహేను రోజులుగా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మహిళ విభాగ సభ్యులను , సహకరించిన ఇతర సభ్యులను ETCA మరియు యు.ఏ.ఈ జాగృతి శాఖ అధ్యక్షులు కిరణ్ కుమార్ పీచర అభినందించారు, అవకాశాన్ని కలిపించిన యాజమాన్యానికి,నిర్వాహకులకు తెలంగాణ జాగృతి తరుపున, శ్రీమతి కవిత తరుపున ఫెరారీ అధికారులకు కృతజ్ఞతలు మరియు జ్ఞాపికలను అందచేయడం జరిగింది. 

కార్యక్రమంలో భాగంగా ప్రీతి ప్రదర్శించిన క్లాసికల్ డాన్స్,బతుకమ్మ,బోనాలు,తెలంగాణ జానపద నృత్యాలు తిలకించిన ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. ప్రదర్శనకారులతో వివిధ దేశాలకు చెందిన వారు ఫొటోస్ దిగడం చాలా సంతోషాన్ని కలిగించింది.   

కార్యక్రమంలో ప్రదర్శనకారులుగా ప్రముఖ క్లాసికల్ డాన్సర్ శ్రీమతి ప్రీతి తాతంబొట్ల,జాగృతి & ETCA  మహిళా సభ్యులు సరోజ అల్లూరి, రాణి కోట్ల,దీపిక ఎలిగేటి,స్వర్ణ ముమ్మిడి, సోనియా రంగు,మోనిక రంగు,లలిత దేవి రంగు మరియు చిన్నారులు నందిని,హన్సిక్ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

కార్యక్రమ కోఆర్డినేటర్లుగా భరద్వాజ్ వాల,స్పందన,అరవింద్, సత్యనారాయణ వ్యవహరించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com