200 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు పోగొట్టుకున్నా:రాజశేఖర్
- October 28, 2017
ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కొంత గ్యాప్ తర్వాత " గరుడ వేగ " మూవీతో నవంబర్ 3 న ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. రాజశేఖర్ కు హిట్ పడి దాదాపు దశాబ్దం అవుతోంది. 'ఎవడైతే నాకేంటి' మూవీ తర్వాత ఇన్నేళ్లకు తన స్టైల్ కు తగ్గ మూవీ 'గరుడ వేగ' అని చెప్పాడు రాజశేఖర్. శుక్రవారం జరిగిన ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన రాజశేఖర్ ఇటీవల మరణించిన తల్లిని గుర్తుచేసుకొని వేదికపై కన్నీళ్లు పెట్టుకున్నారు.
తన కెరీర్ పై తల్లి ఆందోళన పడ్డారని కొన్ని సినిమాల వల్ల ఇప్పటి విలువలో లెక్కేస్తే దాదాపు 200 కోట్ల రూపాయల విలువచేసే ఆస్తులు పోగొట్టుకున్నానని రాజశేఖర్ ఆవేదన చెందాడు. క్యారెక్టర్.. విలన్ రోల్స్ కూ రెడీ అయ్యానని అయినాకానీ సరైన సబ్జెక్ట్ రాలేదని వాపోయాడు. 'గరుడ వేగ' తనకు మళ్ళీ సూపర్ హిట్ ఇచ్చే సినిమా అవుతుందని కొండన్ని ఆశలు పెట్టుకున్నారు. గరుడవేగతో అయినా రాజశేఖర్ మళ్లీ హిట్ అందుకుంటాడేమో చూద్దాం..
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







