'ఛలో' సినిమా ప్రీ లుక్ విడుదల
- October 29, 2017
యువ కథానాయకుడు నాగశౌర్య నటిస్తున్న చిత్రం 'ఛలో'. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగశౌర్య తల్లిదండ్రులు ఉషా ముల్పూరి, శంకర ప్రసాద్ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ప్రీలుక్‌ను శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య తిరుప్పురం అనే బోర్డు ఉన్న ద్వారం వైపు వెళ్తూ కనిపించారు. చుట్టు పక్కల పచ్చని మొక్కలు తప్ప మరేమీ లేవు.
ఇది ఆంధ్రా, తమిళనాడు సరిహద్దులోని కళాశాలలో జరిగే ప్రేమకథ అని దర్శకుడు వెంకీ చెప్పారు. హీరో హైదరాబాద్ నుంచి తిరుప్పురం వెళ్తాడని, అక్కడ ప్రేమకథ మొదలౌతుందని తెలిపారు. ఇందులో రష్మిక మండన్న కథానాయికగా నటిస్తున్నారు. ఆమె కన్నడ సూపర్ హిట్ 'కిరాక్ పార్టీ' ద్వారా ఫేమస్ అయ్యారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







