ప్రముఖ నిర్మాత కన్నుమూత

- October 29, 2017 , by Maagulf
ప్రముఖ నిర్మాత కన్నుమూత

మేడ్చల్: ప్రముఖ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాప్రా మండలం కమలానగర్‌లో తన ఇంటిలో చివరి శ్వాస విడిచారు. అట్లూరి పూర్ణ చంద్రరావు స్వస్థలం కృష్ణా జిల్లా చవుటపల్లి. ప్రముఖ నిర్మాత ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గుడివాడలో నిర్వహించిన ట్యుటోరియల్స్‌లో పూర్ణ చంద్రరావు చదువుకున్నారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆత్మహత్య చేసుకునేందుకు విజయవాడ కృష్ణా నదికి వెళ్లారు. అక్కడే నవయుగ డిస్టిబ్యూటర్స్ వారు పరిచడం కావడం, అట్లూరిని 27రూపాయలకు పనిలో చేర్చుకోవడం జరిగింది. నవయుగ డిస్టిబ్యూటర్స్‌లో రిప్రజంటేటివ్‌ చేరి గుంతకల్లు బ్రాంచి మేనేజర్‌గా ఎదిగారు. ఆ తర్వాత గుడివాడ, విజయవాడలో పలు ధియేటర్లలో ఆపరేటర్ కమ్ బుకింగ్ క్లర్క్‌గా కూడా పని చేశారు.
అనంతరం నవయుగ గుంతకల్లు మేనేజర్ దగ్గర సహాయకుడి పనిచేసేందుకు మద్రాస్ వెళ్లారు. విఠలాచార్య, పి. పుల్లయ్య దగ్గర డైరెక్షన్ యూనిట్‌లో పనిచేశారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన దేవదాసు సినిమా నిర్మాత డీఎల్ నారాయణ, ఎస్. భావనారాయణ ప్రోత్సాహంతో ప్రొడక్షన్ యూనిట్‌లోకి వెళ్లారు. ఆ తర్వాత విజయవాడ నవభారత్ బుక్ హౌస్ ప్రకాశ్ రావుతో కలిసి 'అగ్గిమీద గుగ్గిలం' సినిమా తీశారు. అలా చాలా సినిమాలు తీయడంతో పాటు పలు రీమేక్ సినిమాలు కూడా నిర్మించి సక్సెస్ సాధించారు. తండ్రీ-కొడుకులు, శ్రీ, కలవారి కోడలు, ఆడపడుచు, ఛోటా బెహన్ వంటి చిత్రాలను నిర్మించారు. చిరంజీవితో 'చట్టానికి కళ్లులేవు' తీశారు. ఈతరం హీరోలు రవితేజ, శివాజీ, ఉదయ్ 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com