క్యాబేజి, నిమ్మకాయ సూప్
- October 29, 2017
కావలసిన పదార్థాలు: క్యాబేజి (మీడియం సైజు ) - పావుభాగం (నిలువు ముక్కలుగా తరగాలి), ఉల్లిపాయ - ఒకటి (సన్నటి ముక్కలు తరిగి), వెల్లుల్లి రెబ్బలు - మూడు (మెదిపి), అల్లం తురుము - ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి చిన్నది - ఒకటి (తరిగి), పసుపు - చిటికెడు, ఆలివ్ నూనె - ఒక టేబుల్ స్పూన్, కూరగాయలు ఉడికించిన నీళ్లు - నాలుగు కప్పులు, జీలకర్ర, సోంపు, ధనియాలు (వేగించి పొడి చేయాలి) - ఒక టేబుల్ స్పూన్, ఉప్పు, మిరియాలు - రుచికి సరిపడా, నిమ్మకాయ - ఒకటి.
తయారీ విధానం: ఆలివ్ నూనెను ఒక గిన్నెలో వేడిచేసి పసుపు, ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, క్యాబేజి తరుగు వేసి కాసేపు వేగించాలి. తరువాత ఉప్పు కొద్దిగా వేసి ఐదు నిమిషాలు ఉడికించి అర టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసి బాగా కలపాలి. ఇందులో ఉడికించిన కూరగాయల నీళ్లు పోసి, ఉప్పు, మిరియాలు వేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. మిగతా మసాలా పొడి వేసి మూత పెట్టి నాలుగు నిమిషాలు ఉడికించాక సూప్‌ను సర్వింగ్ గిన్నెలో పోసుకోవాలి. నిమ్మకాయ రసం పిండుకుని వేడివేడిగా తాగితే ఆహా అనాల్సిందే.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు