బురుమై నుండి 1,253 మాదక ద్రవ్య మాత్రల అక్రమ రవాణా చేస్తున్న ఓమాని మహిళ అరెస్టు
- October 29, 2017
బురుమై గవర్నైట్ పరిధిలో మానసిక సంబంధిత రోగులు ఉపయోగించే మత్తు పదార్థాలు కలిగిఉన్న1,253 మాత్రలను వేరే ప్రాంతానికి తరలిస్తున్న ఒక ఒమన్ మహిళను నార్కోటిక్స్ మరియు సైకోట్రోపిక్ పదార్ధాలపై పోరాట డైరెక్టరేట్ జనరల్ అరెస్టు చేశారు. ఆమె అక్రమ రవాణాకు పాల్పడుతుందనే ఆరోపణలపై అరెస్టు చేసినట్లు రాయల్ ఒమాన్ పోలీసులు తమ ట్వీట్టర్ ఖాతాలో తెలిపారు. ఆ మహిళ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు తెలిపారు. ఈ తరహాలో అక్రమ మాధక ద్రవ్యాలను తరలించే అనుమానితులు, స్మగ్లర్లకు సంబంధించిన కీలకమైన సమాచారం గూర్చి ఏమైనా తెలియచేయాలనుకొంటే పౌరులు మరియు నివాసితులు 9999 ఫోన్ నెంబర్ కు తెలియచేయాలని లేదా సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద తెలియచేయవచ్చని పేర్కొన్నారు. మాదక ద్రవ్య వినియోగదారులు మరియు వ్యాపారులను గుర్తించడానికి సహాయపడే ఎటువంటి సమాచారం అయినా నిరభ్యంతరంగా నివేదించడానికి వెనుకాడవద్దని ఈ సందర్భంగా రాయల్ ఒమాన్ పోలీస్ ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..