బహ్రెయిన్ నడి రోడ్డులో కారుని నిలిపి భార్య మొహంపై పిడి గుద్దులతో భర్త దాడి

- October 30, 2017 , by Maagulf
బహ్రెయిన్ నడి రోడ్డులో కారుని నిలిపి భార్య మొహంపై పిడి గుద్దులతో భర్త దాడి

మనామా : గల్ఫ్ దేశాలలోనూ గృహ హింస గణనీయంగా పెరుగుతోంది.  బహ్రెయిన్ భార్యతో కారులో ప్రయాణిస్తున్న ఒక భర్త నడిరోడ్డులో కారును నిలిపి ఆగ్రహంతో ఆమె మొఖం మీద పలుమార్లు చేతిథితో పిడిగుద్దుల వర్షం కురిపించాడు. ఆ మహిళకు చెందిన న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటనలో  బాధితురాలిని  రాజ్యంలోని ప్రధాన రోడ్డుల్లో ఒకటైన మార్గంలో భార్యతో కల్సి కారులో  ప్రయాణిస్తున్నాడు.  డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మునుపటి విబేధాలను మనస్సులో ఉంచుకొని ఆ భర్త , స్వల్ప కారణానికే  వాహనం రోడ్డు మధ్యలో ఆపి ఆ మహిళ మొహంపై రెండుసార్లు బలంగా చేతితో మోదాడు. దాంతో ఆమె అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. నిందితుడు జరిపిన పాశవిక దాడిలో ఆ మహిళకు చావు తప్పి కన్నులొట్టబోయి నల్లగా మారింది. అపస్మారక స్థితిలో ఉన్న తన భార్యను నిర్దాక్షిణ్యంగా వదిలి నిందితుడు అక్కడనుంచి పారిపోయాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ సంఘటన గురించి తెల్సుకోవడంతో ఆ రాక్షస భర్తని అరెస్టు చేశారని న్యాయవాది వివరించాడు. ఇది మూడవ కేసు అని  గత రెండు నెలల్లోనే బహ్రెయిన్ లో భార్యలను దారుణంగా హింసించే  భర్తలు నానాటికి పెరుగుతున్నారని గృహ హింస సమస్య క్రమేపీ దేశంలో పెరుగుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు, ఇంకా వెలుగులోనికి రాని గృహహింస కేసులు ఎన్నో ఉన్నాయని...స్రీలు పడుతున్న కష్టాలు..వేదన గురించి ఇంకా వెలుపలికి మాట్లాడని.. వెలుగులోనికి రాని బాధితుల సమస్యలు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com