యువ దర్శకుడు కన్నుమూత..!
- October 30, 2017
ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలు శోకసంద్రంలో మునిగిపోయాయి. తాజాగా అగ్ర నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావు మరణం మరువక ముందే తమిళ యువ దర్శకుడు కన్నన్ రంగస్వామి కి గుండెపోటు మరణించారు. అతి చిన్న వయసులో దర్శకత్వ రంగంలోకి అడుగు పెట్టిన కన్నన్ రంగస్వామి ఈ మద్య '' దాయం '' పరిచయం అయ్యారు.
కొత్త నటీనటులతో '' దాయం '' చిత్రానికి దర్శకత్వం వహించిన కన్నన్ రంగస్వామి ఆ సినిమా కమర్శియల్ గా హిట్ కాకపోయినా..పరవాలేదు అనిపించుకుంది. ఇక దాని తర్వాత మరో సినిమాకు కన్నన్ రంగస్వామి ప్రయత్నాలు చేస్తున్నాడు . ఇంతలో కన్నన్ రంగస్వామి కి గుండెపోటు వచ్చింది దాంతో అతడ్ని ఆసుపత్రిలో చేర్పించారు.
అతడి ఆరోగ్యం మెరుగు పడకపోగా కోమాలోకి వెళ్ళిపోయాడు. చికిత్స పొందుతున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు తీవ్రం కావడంతో ప్రాణాలు విడిచాడు. కన్నన్ రంగస్వామి మరణంతో అతడి కుంటుంబ సభ్యులతో పాటు గా ఆ చిత్ర బృందం షాక్ కి గురయ్యారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ దర్శకుడు అకస్మాత్తుగా కన్నుమూయడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష