ఘనంగా కూతురి వివాహం చేసిన విక్రమ్

- October 30, 2017 , by Maagulf
ఘనంగా కూతురి వివాహం చేసిన విక్రమ్

కోలీవుడ్ హీరో ‘చియాన్’ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం సోమవారం ఉదయం చెన్నైలో పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. కెవిన్‌కేర్ గ్రూప్ అధినేత సీకే రంగనాథన్ కుమారుడు రంజిత్‌తో అక్షిత వివాహం జరిగింది.  కాగా, మను రంజిత్ ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు. వీరి వివాహం కరుణానిధి నివాసంలో నిరాడంబరంగా జరగడం గమనార్హం.  

గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న అక్షిత, రంజిత్‌లు పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహ వేడుక చెన్నైలోని గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో జరిగింది.  ఈ సందర్భంగా తమిళ సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఇరు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి రిసెప్షన్‌ మంగళవారం చెన్నైలోని మేయర్‌ రామనాథన్‌ హాల్‌లో జరగనుంది. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు అవనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com