బుర్జ్ ఖలీఫా వద్ద భారీ సెటప్ తో సాహో

- October 31, 2017 , by Maagulf
బుర్జ్ ఖలీఫా వద్ద భారీ సెటప్ తో సాహో

ప్రభాస్- శ్రద్ధాకపూర్ జంటగా రానున్న ఫిల్మ్ 'సాహో'. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్‌తో మూవీపై అంచనాలను భారీగా పెంచేసింది. కొన్నిరోజుల్లో సాహో యూనిట్ దుబాయ్‌కి షిఫ్ట్ అవుతోంది. అక్కడ 20 నిమిషాల భారీ యాక్షన్, ఛేజింగ్ సీన్స్‌ని బుర్జ్ ఖలీఫా వద్ద చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాడు డైరెక్టర్ సుజీత్. ఇందులో కార్లు, బైక్‌లు, ట్రక్స్ ఉపయోగించనున్నారట. ఇంత ఎక్కువ సన్నివేశాలను ఇప్పటివరకు బాలీవుడ్ మూవీల్లోనూ రాలేదని యూనిట్ చెబుతున్నమాట.
హాలీవుడ్ స్టంట్‌ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో వీటిని షూట్ చేయనున్నారు. గతంలో ట్రాన్స్‌ఫార్మర్స్, డైహార్డ్ వంటి చిత్రాలకు పనిచేసిన అనుభవం కెన్నీ సొంతం. అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, జాకీష్రాఫ్ తదితరులు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ త్రయం శంకర్ - ఎహ్సాన్ - లాయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసమ్మర్ తర్వాత రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com