యూఏఈ వాట్సాప్ యూజర్లకు కూడా సరికొత్త ఫీచర్
- October 31, 2017
అబుదాబి: వాట్సాప్ ద్వారా పొరపాటుగా ఓ అసభ్య సందేశాన్ని మీ మిత్రులకు పంపించారా? ఆ సందేశం వల్ల కొంపలు మునగనున్నాయా ?.. ఇకపై అలాంటి భయం అక్కర్లేదు. పాపులర్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. పంపించిన సందేశం అసభ్యకరమైనదని గుర్తిస్తే వెంటనే డిలీట్ చేసుకునే అవకాశం యూఏఈ వాట్సాప్ వినియోగదారులకు దక్కింది. సందేశాన్ని పంపించిన 7 నిమిషాలలో సందేశాన్ని ఇకపై తొలగించవచ్చు. ఒకవేళ మెసేజ్‌ను పంపించి 7 నిమిషాలు దాటితే చేసేదేమీ ఉండదు. ఈ సరికొత్త ఫీచర్ యూఏఈ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. యాప్‌ను అప్‌డేట్ చేస్తే ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. పంపించిన మెసేజ్‌పై టాప్ అండ్ హోల్డ్ చెయ్యాలి. తర్వాత డిలీట్ ఫర్ ఎవ్రీవన్ అనే ఆప్షన్ టాప్ చేస్తే పని పూర్తైనట్లే. కాబట్టి యూఏఈలోని వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్‌ను నిర్భయంగా ఉపయోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..