ప్రియుడికై భర్తను చంపాలనే ప్రయత్నం చేసిన భార్య..బలైన బంధువులు
- October 31, 2017
ఇష్టం లేని వ్యక్తితో సంసారం దినదిన గండంగా మారుతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఆ సంసారంలో చోటుచేసుకుని వుంటుంది. ఐతే ఖచ్చితంగా భర్త లేదంటే భార్య ఏదో ఒక అఘాయిత్యానికి పాల్పడే పరిస్థితి తలెత్తుతుందని గత సంఘటనలు పట్టి చూపించాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది.
ఓ యువతి ఆల్రెడీ ఓ ప్రియుడితో ప్రేమాయణ సాగిస్తోంది. ఐతే ఆమె తల్లిదండ్రులు దాన్ని అంగీకరించలేదు. మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేశారు. ఇష్టం లేని పెళ్లి చేసినందుకు భర్తతో కాపురం చేయడం ఇష్టంలేక అతడినే హతమార్చేందుకు ప్లాన్ చేసింది ఓ భార్య. అదికాస్తా బెడిసికొట్టింది. 13 మంది ప్రాణాలను తీసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లోని ముజఫర్ జిల్లాలో జరిగింది. గత సెప్టెంబర్ నెలలో ఆసియా బీబీ అనే యువతికి ఇష్టం లేని పెళ్లి చేశారు.
పెళ్లయిన తర్వాత తనకి ఆ పెళ్లి ఇష్టం లేదని చెప్పి వస్తే పుట్టింటివారు ఏమంటారోనని ఏకంగా భర్తనే చంపేసి ప్రియుడితో వెళ్లిపోవాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లే భర్తకు పాలలో విషం కలిపి ఇచ్చింది. ఐతే ఆ పాలను అతడు తాగలేదు. ఆ పాలను అలాగే వుంచేసింది. అది కాస్తా పెరుగుగా మారింది. ఇంతలో భర్త ఇంటికి బంధువులు వచ్చారు. ఆ బంధువులకు విషం కలిసిన పెరుగును లస్సీగా చేసి భర్తతో పాటు అతడి బంధువులకూ ఇచ్చేసింది. దానితో వారంతా తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. వీరిలో 13 మంది అక్కడికక్కడే చనిపోగా మరో 14 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెతో పాటు ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు