20 కొత్త ప్రపంచాలను కొనుగొన్న నాసా.!
- November 01, 2017
జీవులు జీవించడానికి అవకాశంగల 20 నూతన గ్రహాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మనం ఇప్పటి వరకు ఊహించినదాని కన్నా ఎక్కువగా నివాసయోగ్యమైన ప్రపంచాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మరో భూమి మానవాళికి చేరువయ్యే రోజులు మరెంతో దూరంలో లేవని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రహాంతర అంశాలపై పరిశోధన జరుపుతున్న నాసాకు చెందిన కెప్లెర్ మిషన్ శాస్త్రవేత్త జెఫ్ కఫ్లిన్ తెలిపిన ఈ వివరాల ప్రకారం 'ఎర్త్ 2.0'ను గుర్తించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో నూతన ఆశా కిరణాలు ప్రసరిస్తున్నాయని చెప్పవచ్చు. జీవసారంగల గ్రహాంతర ప్రపంచాల అన్వేషణలో ఈ 20 నూతన గ్రహాలు చాలా బాగా ఉపయోగపడతాయి. వీటిలో కొన్ని గ్రహాలు మన భూ గ్రహం మాదిరిగా ఉండటం విశేషం. కొన్ని తేడాలను మినహాయిస్తే, జీవించేందుకు చక్కని అవకాశాన్ని కల్పించేవిధంగా ఉన్నాయి. వీటిలో సంవత్సరాలు కూడా మనకు సరిపోయేవిధంగానే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కూడా జీవనాన్ని ప్రోత్సహించేవిధంగానే ఉన్నాయి.
వీటిలో చాలా అనుకూలంగా ఉన్న గ్రహానికి కేఓఐ-7923.0 అని పేరు పెట్టారు. మరొక భూమిని కనుగొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనిలో సంవత్సరం నిడివి 395 రోజులు, కాగా భూమి పరిమాణంలో 97 శాతం ఉంది. అయితే భూమి కన్నా చల్లగా ఉంది. కొన్ని గ్రహాల్లో సంవత్సరం నిడివి తక్కువ కాలం ఉంటుంది, దీనివల్ల సమస్యలు ఎదురవుతాయి.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







