కొడుకును హీరోగా లాంచ్ చేస్తున్న గాలి
- November 02, 2017
మైనింగ్ లో భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డి దృష్టి వెండితెరమీదకు మళ్లింది. త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్టు ఆయన తన మనసులో మాట బయటపెట్టేశారు. అంతేకాదు.. తన కొడుకు కిరీటి రెడ్డి ని హీరోగా పెట్టి సినిమా సినిమా తీయబోతున్నట్టుగా కూడా తెలిపారు. 2018 మార్చి తర్వాత సినీ రంగంపై పూర్తిస్థాయిలో దృష్టి పెడతానని చెప్పారు. తానే స్వయంగా పాడిన పాట సీడీని కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా గాలి బెంగళూరులోని చాముండేశ్వరి స్టూడియోలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సినీరంగ ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు. ఏ పని చేసినా అత్యంత కాస్ట్లీగా భారీ స్థాయిలో నిర్వహించే గాలి.. సొంత కొడుకు సినిమా కోసం ఏ రేంజ్ లో ఖర్చుపెడతాడో చూడాలి. కన్నడ, తెలుగు చిత్రపరిశ్రమలో గాలి తనయుడి సినిమా ప్రభావం గట్టిగానే ఉండొచ్చు కూడా. ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్(ఓఎంసీ) అధినేత అయిన గాలి జనార్థనరెడ్డి అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకెళ్లి, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.
పెద్ద నోట్ల రద్దు సమయంలో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుమార్తె పెళ్లి చేసి మళ్లీ ఇటీవల ఊపుఊపారు గాలి జనార్థనరెడ్డి.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







