రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు

- November 02, 2017 , by Maagulf
రేపటి నుంచి వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు

ఢిల్లీ: నవంబరు 3 నుంచి ఢిల్లీలో మూడు రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా -2017 సదస్సు ప్రారంభం కానుంది. విజ్ఞన్ భవన్ లో ప్రారంభం కానున్న ఈ సదస్సును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ , ఉత్పత్తి రంగాల్లోని అవకాశాలను ఆయన వివరించనున్నారు. పలుదేశీయ, విదేశీ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే ఇండియా గేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com