పాక్ జాతిపిత కూతురు దినా మృతి
- November 03, 2017
పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా ఏకైక కుమార్తె దినా వాడియా గురువారం న్యూయార్క్‌లోని తన ఇంట్లో మృతి చెందారు. 98 ఏళ్లు వయస్సు గల ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె మరణవార్తను వాడియా గ్రూప్ ప్రతినిధి వెల్లడించారు. ఆమెకు కుమారుడు, వాడియా గ్రూప్ చైర్మన్ నుస్లీ ఎన్ వాడియా, కూతురు డయానా ఎన్ వాడియా ఉన్నారు. ఆమె అంత్యక్రియలు న్యూయార్క్‌లో జరగనున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా దినా వాడియా కుటుంబం న్యూయార్క్‌లో ఉంటోంది. వ్యాపార అవసరాల నిమిత్తం నుస్లీ వాడియా ముంబైకి వస్తుంటాడు. 1919 ఆగస్టు 15న జన్మించిన దినా వాడియా, పార్శీ కుటుంబానికి చెందిన నెవెల్లీ వాడియాను 1938లో పెళ్లి చేసుకుంది. దేశంలో ఎంతో మంది ముస్లిం అబ్బాయిలు ఉండగా పార్శీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఎందుకని తండ్రి ఆమెను ప్రశ్నించగా మరి నువ్వెందుకు పార్శీ అమ్మాయిని చేసుకున్నావ్? అని దినా తిరిగి ప్రశ్నించిందని అంటారు. మహ్మద్ అలీ జిన్నా కూడా పార్శీ కుటుంబానికి చెందిన రత్తన్ బాయిని పెళ్లిచేసుకున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్‌లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్‌లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్‌కు పీవీ సింధు..







