కుళ్లిన మాంసంతో హైదరాబాద్ దమ్ బిర్యానీ వడ్డిస్తున్న హోటల్ యజమానులు
- November 03, 2017
హైదరాబాద్ దమ్ బిర్యానీకి అర్థం మారిపోతోంది. కుళ్లిన మాంసంతో కస్టమర్లను మోసం చేస్తున్నారు. పురుగులు పట్టిన చికెన్‌ను వడ్డిస్తూ.. హైదరాబాద్ పరువు తీస్తున్నారు.. హోటల్ యజమానులు.
శంషాబాద్‌లో ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారిలో చాలా హోటళ్లున్నాయి. పేరుగొప్ప హోటళ్లలోను చెడిపోయిన మాంసంతో బిర్యానీ వండుతున్నారు. వారం క్రితం తెచ్చిన నాన్‌వెజ్‌ను, ఫ్రిజ్‌లో ఉంచుతున్నారు. అది గడ్డకట్టి రాయిలా తయారవుతోంది. దాన్నే పెనం మీద.. నూనెలో వేడి చేసి.. మసాలా పొడులు దట్టించి.. ఫ్రెష్‌గా తెస్తున్నారు. ఆ వేడి మీద.. కస్టమర్లు సైతం లొట్టలేసుకుంటూ లాగించేస్తున్నారు.
ఒక్కసారి కిచెన్‌లోకి వెళ్లి చూస్తే.. ఎంత దరిద్రపుగొట్టు పద్ధతులు ఫాలో అవుతున్నారో తెలుస్తోంది. కుళ్లిపోయి పురుగులు పట్టిన చికెన్, మటన్, చేపలు, రొయ్యల్ని వాడుతున్నారు. ఏకంగా 15 హోటళ్లలో తనిఖీలు జరిగాయి. పాడైపోయిన పదార్థాలను అధికారులు రోడ్డుపై పారబోశారు. బయట తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.
శంషాబాద్ ఈవో శ్యాంసుందర్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. తమ బండారం బయటపడడంతో కొందరు హోటళ్ల యజమానులు, సిబ్బంది గొడవకు దిగారు. దీంతో.. ఎయిర్‌పోర్ట్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. పరిస్థితి చేయిదాటకుండా చూశారు. ఆహార పదార్థాల విషయంలో మరోసారి ఇలాంటి నీచానికి దిగజారితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హోటళ్ల యజమానుల్ని హెచ్చరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







