ఇప్పుడు మీరు మీ టీవీ ఎయిర్ ఇండియాలో కూడా ఉచితంగా తరలించవచ్చు

- November 04, 2017 , by Maagulf

మస్కట్ : మస్కట్ నుండి భారత దేశానికి ప్రయాణించే ఎయిర్ ఇండియా విమాన ప్రయాణీకులు ఇకపై తమ వెంట 48 అంగుళాల టి వి వరకు ఉచితంగా త్తేసుకెళ్లేందుకు అనుమతించబడతారని  ఎయిర్ ఇండియా  జాతీయ రవాణా సంస్థ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సమాచారంను ఈ విధంగా తెలిపింది: "టెలివిజన్ రవాణాకు సంబంధించి 48 అంగుళాల టెలివిజన్ ఈ రోజు నుంచి మరల నోటీసు ఇచ్చేంతవరకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులలో ఉచితంగా తమ వెంట తీసుకువెళ్ళవచ్చు. ప్రయాణీకుల ఉచిత సామాను భత్యం మరియు ఉచిత సామాను భత్యం పైన ఉన్న ఏదైనా అదనపు సామాను రుసుములను వసూలు చేయని విధంగా ఇది పరిగణించబడుతుంది. " స్థల అడ్డంకి వలన, మస్కట్ నుండి ఎయిర్ ఇండియా విమానాలలో 48 అంగుళాల టెలివిజన్ మించి తీసుకురావడంకు సాధ్యపడదు, "మంగళవారం జారీ చేసిన ఒక  అధికారిక ప్రకటనలో ఎయిర్లైన్స్ తెలిపింది. శుక్రవారం ఎయిర్ ఇండియాకు పోటీ విమాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇదే విధమైన పథకాన్ని ప్రకటించారు. భారతీయ విమానాశ్రయాలలో టీవీ తరలింపుపై పన్ను  ఇప్పటికీ చెల్లించవలసి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com