కువైట్‌లో రాజకీయ సంక్షోభం
- November 04, 2017కువైట్: ఓ పార్లమెంట్ సభ్యుడిపై ఓ కేసులో విచారణకు ఆదేశాలివ్వడమే ఈ సంక్షోభానికి అసలు కారణం. పార్లమెంట్ సమావేశాలు మొదలైన వారం రోజుల్లోనే ఇదంతా జరిగిపోవడం గమనార్హం. పార్లమెంట్ సభ్యుడిపై విచారణ జరగనుండటంతో సభ్యులంతా సోమవారం రాజీనామా ప్రకటించారు. అన్నట్లుగానే మంత్రులంతా మూకుమ్మడి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని కూడా రాజీనామా చేయక తప్పలేదు. పార్లమెంట్‌ను రద్దు చేస్తూ కువైట్ రాజు నిర్ణయం తీసుకున్నారు.కువైట్ చట్టాల ప్రకారం మంత్రులంతా రాజీనామా చేస్తే ప్రధాని కూడా రాజీనామా చేయక తప్పదు. దీంతో ప్రధాని కూడా తన రాజీనామాను గురువారం కువైట్ రాజు జబెర్ అల్ అహ్మద్ అల్ శబహ్కు అందజేశారు. కువైట్ రాజు ఆయన రాజీనామాను ఆమోదించారు. తదుపరి ప్రధాని, క్యాబినెట్‌ను ఎంపిక చేసేవరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరారు. అయితే కొత్త ప్రధానిని ఎంత కాలంలో ఎంపిక చేస్తారనేది తెలియరాలేదు. కువైట్ చట్టాల్లో ఆ కాల పరిమితిని సూచించకపోవడంతో కొన్ని నెలలపాటు ప్రధాని లేకుండానే పాలన జరిగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్‌కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్‌లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్
- ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ
- ఆర్టీసీ ఉద్యోగులు జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్స్ వేసుకోకూడదు: ఎండీ సజ్జనార్
- బంపర్ న్యూస్..బంగారం రేట్ భారీగా తగ్గింది
- ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
- ఏపీకి క్యూకట్టిన ఆంధ్ర ఓటర్లు పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్