ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ

- May 11, 2024 , by Maagulf
ఇజ్రాయెల్ ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన యూఏఈ

యూఏఈ: యుద్ధం తర్వాత గాజాలో భవిష్యత్ ప్రభుత్వానికి సహాయం చేయడంలో గల్ఫ్ దేశాలు పాలుపంచుకోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అన్నారు. ఈ వ్యాఖ్యలపై యూఏఈ స్పందించింది. ఇజ్రాయెల్ నాయకుడి వ్యాఖ్యలను ఖండించింది. ఈ మేరకు  X(ట్విటర్) లో విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ పోస్ట్ చేశారు.  "ఇజ్రాయెల్ ఆక్రమణలో ఉన్న గాజా స్ట్రిప్ యొక్క పౌర పరిపాలనలో పాల్గొనాలని పిలుపునిస్తూ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు చేసిన ప్రకటనలను యూఏఈ ఖండిస్తోంది" అని షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఒక అరబిక్ పోస్ట్‌లో తెలిపారు.  పాలస్తీనా ప్రజల ఆశలు మరియు ఆకాంక్షలను నెరవేర్చే పాలస్తీనా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి యూఏఈ సిద్ధంగా ఉంటుందని షేక్ అబ్దుల్లా చెప్పారు. ఇందులో స్వాతంత్ర్యం కూడా ఉందన్నారు.   ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ మరియు గాజాలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాలని పాలస్తీనియన్లు ఆశిస్తున్నారు. దీనికి యూఏఈ మద్దతు ఇస్తుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com