విలక్షణ నటుడి బర్త్‌డే స్పెషల్ 'విశ్వరూపం 2' ట్రైలర్
- November 04, 2017
చెన్నై: విలక్షణ నటుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం 2'. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అయితే సినిమా ట్రైలర్‌ను కమల్ పుట్టినరోజును పురస్కరించుకుని నవంబరు 7న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రైలర్ పనులు దాదాపు పూర్తయ్యాయని సంగీత దర్శకుడు జిబ్రన్ తెలిపారు.
'ట్రైలర్ అద్భుతంగా వచ్చింది. నేను విడుదల తేదీ చెప్పకూడదు. కానీ ట్రైలర్ అతి త్వరలో రాబోతోంది' అని ఆయన అన్నారు. మరి ట్రైలర్ ఎప్పుడు విడుదల కాబోతోందో చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. కమల్ తన పుట్టినరోజునే రాజకీయ ప్రవేశం గురించి ఓ కీలక ప్రకటన చేయనున్నారని కొన్ని రోజులుగా వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.
మరోపక్క కమల్ 'శభాష్‌నాయుడు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం దర్శకత్వ, నిర్మాణ బాధ్యతల్ని కూడా ఆయనే నిర్వర్తిస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి కొన్ని యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించాల్సి ఉందట. కమల్ కాలికి ఇటీవల గాయం కావడంతో ఇంకొన్నాళ్లు యాక్షన్‌కు దూరంగా ఉండమని వైద్యులు సూచించారు. దీంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







