ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ విమానాల్లో ఉచితంగా టీవీ తీసుకెళ్ళొచ్చు
- November 04, 2017
ఒమన్ నుంచి ఇండియాకి వెళ్ళే ప్రయాణీకులకు శుభవార్త. 48 ఇంచ్‌ల వరకు టీవీలను ఉచితంగానే ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ విమానాల్లో ఇండియాకి తీసుకెళ్ళేందుకు వీలుంది. అయితే ఇండియన్ ఎయిర్‌పోర్ట్స్‌లో టీవీలపై డ్యూటీని చెల్లించడానికి ఆస్కారం ఉంది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ, తదుపరి ప్రకటన వచ్చేదాకా ఈ ఆఫర్ అమల్లో ఉంటుందని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ప్రయాణీకులకు ఇది ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్‌గా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఎయిర్ ఇండియా ప్రతినిథులు. ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్ దాటితే, ఛార్జీలు వర్తిస్తాయి. ఎయిర్ ఇండియా ప్రకటన వెలువడిన మరుసటిరోజే, జెట్ ఎయిర్వేస్ తన వెబ్సైట్లో ఫ్రీ బ్యాగేజ్ అలవెన్స్లోకి టీవీలను కూడా ఉచితంగా చేర్చుతున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 10 వరకు ఇది అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







