దుబాయ్‌లో ఆశా భోంస్లే, జావెద్‌ అలీ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సెర్ట్‌

- November 04, 2017 , by Maagulf

దుబాయ్‌: శుక్రవారం దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌, షేక్‌ రషీద్‌ హాల్‌లో 'రహే నా రహే హమ్‌ - మెహెకా కరెంగే' పేరుతో లైవ్‌ మ్యూజిక్‌ కాన్సెర్ట్‌ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ సీనియర్‌ బాలీవుడ్‌ గాయని ఆశా భోంస్లే, జావెద్‌ అలీ అద్భుతమైన సాంగ్స్‌తో ఆహూతుల్ని అలరించారు. జాగ్వార్‌, అల్‌ తయెర్‌ మోటార్స్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సెర్ట్‌కి హాజరైనవారంతా మధుర గీతాల్ని హమ్‌ చేస్తూ, ఆ పాటలకు మైమర్చిపోతూ అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యారు. 

- అరుణ్ కుమార్ సుర్నిదా (మాగల్ఫ్ ప్రతినిధి, దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com