6న 'భాగమతి' తళుక్కుమననుంది

- November 05, 2017 , by Maagulf
6న 'భాగమతి' తళుక్కుమననుంది

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక అనుష్క టైటిల్‌ రోల్‌లో నటించిన చిత్రం 'భాగమతి'. జి. అశోక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను అనుష్క పుట్టినరోజు సందర్భంగా నవంబరు 6న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 'బాహుబలి: ది కన్‌క్లూజన్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత అనుష్క నటించిన చిత్రమిది.
యూవీ క్రియేషన్స్‌ సంస్థ 'భాగమతి'ని నిర్మిస్తోంది. ఉన్ని ముకుందన్‌, ఆది పినిశెట్టి, జయరాం, ఆశా శరత్‌ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'భాగమతి' తర్వాత అనుష్క తన కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు. అయితే దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించనున్న ఓ చిత్రంలో ఆమె నటించే అవకాశాలు ఉన్నట్లు సినీవర్గాల సమాచారం. ఇందులో పాత్ర కోసమై దర్శక, నిర్మాతలు ఆమెను ఇటీవల కలిశారట. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com