అబ్బాయ్ రానాతో రొమాన్స్ చేసిన కాజల్, ఇప్పుడు బాబాయ్ వెంకీతో రొమాన్స్ కి రెడీ

- November 06, 2017 , by Maagulf
అబ్బాయ్ రానాతో రొమాన్స్ చేసిన కాజల్, ఇప్పుడు బాబాయ్ వెంకీతో రొమాన్స్ కి రెడీ

విక్టరీ వెంకటేష్ గురు చిత్రం తర్వాత మరో సినిమా స్టార్ట్ చేయలేదు. వెంకీ వీళ్ళతో సినిమాలు చేయబోతున్నాడంటూ ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ల పేర్లు వినిపించాయి కానీ, అవేవి ఫైనల్ కాలేదు. ఫైనల్ గా ఆ చాన్స్ డైరెక్టర్ తేజాకి వచ్చింది. నేనే రాజు నేనే మంత్రి సక్సెస్ అవ్వడంతో మళ్ళీ తేజకి క్రేజ్ వచ్చింది. దీంతో పాటు వెంకటేష్ తో సినిమా చేసే చాన్స్ కూడా వచ్చింది. వెంకటేష్ ఇందులో కాలేజ్ ప్రొఫెసర్ గా నటించబోతున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

వెంకటేష్, తేజ కాంబోలో ఫస్ట్ టైమ్ వస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ఫైనల్ అయ్యింది. తేజ గత చిత్రం నేనే రాజు నేనే మంత్రిలో కాజలే హీరోయిన్. ఆ సినిమాలో అబ్బాయ్ రానాతో రొమాన్స్ చేసిన కాజల్, ఇప్పుడు బాబాయ్ వెంకీతో రొమాన్స్ కి రెడీ అయ్యింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com