సూపర్‌పాస్ట్ రైలు కి పెరిగిన టికెట్ ధర
- November 06, 2017
ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 మొయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను సూపర్‌ఫాస్ట్ రైళ్లుగా అప్‌గ్రేడ్ చేసినట్లు భారత రైల్వే శాఖ ప్రకటించింది. దీంతో ఈ 48 రైళ్ల టికెట్ల ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేసింది. స్లీపర్ కోచ్‌కు రూ.30, సెకండ్, థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లకు రూ.45, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌కు రూ.75 అదనంగా ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే శాఖ వెల్లడించింది. పెంచిన టికెట్ల ధరలతో రైల్వే శాఖకు రూ.70 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 1 తేదీ నుంచి కొత్త టైం టెబుల్ అమల్లోకి వస్తుందని, 48 రైళ్ల వేగాన్ని గంటకు 5 కిలోమీటర్ల వరకు పెంచినట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు
- తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి..
- ఇండిగో రద్దుల పై ప్రధాని మోదీ స్పందన
- కువైట్ వెదర్ అలెర్ట్..భారీ వర్షాలు..!!
- చైనా, మలేషియా బ్యాటరీల పై GCC సుంకాలు..!!
- కొత్త పార్కులు, డిజిటల్ రెసిలెన్స్ పాలసీని ప్రకటించిన షేక్ హమ్దాన్..!!
- సౌదీలో అమీర్.. ద్వైపాక్షిక పెట్టుబడుల వృద్ధిపై సమీక్ష..!!
- బహ్రెయిన్-భారత్ మధ్య ఉన్నత స్థాయి చర్చలు..!!
- ఒమన్ లో బ్యాలెట్, ఆర్కెస్ట్రా కాన్సర్టుల సీజన్..!!
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ







