మాస్ హీరో విశాల్ నటించిన డిటెక్టివ్ మూవీ ఈ నెల 10న రిలీజ్

- November 08, 2017 , by Maagulf
మాస్ హీరో విశాల్ నటించిన డిటెక్టివ్ మూవీ ఈ నెల 10న రిలీజ్

తమిళ్ తో పాటు తెలుగులోనూ క్రేజ్ ఉన్న మాస్ హీరో విశాల్, మళ్ళీ తన కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తుప్పరివాలన్ పేరుతో రిలీజ్ కోలీవుడ్లో సూపర్ హిట్ అయిన సినిమాని, డిటెక్టివ్ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నాడు. ఈ మూవీ ఈ నెల 10న రిలీజ్ అవుతోంది.
సింపుల్ స్టోరీస్ ని సెలక్ట్ చేసుకుని, నేచరుల్ టేకింగ్ తో...మాస్ ఆడియన్స్ కి కావాల్సిన ఎలిమెంట్స్ తో సినిమా చేస్తాడు విశాల్. అందుకే అటు కోలీవుడ్ అయినా..ఇటు టాలీవుడ్ అయినా విశాల్ కి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. పూజ మూవీ తర్వాత తెలుగులో మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకోని విశాల్ ఇప్పుడు డిటెక్టివ్ మూవీతో వస్తున్నాడు.
డిటెక్టివ్ మూవీ తుప్పరివాలన్ గా తమిళ్ లో రిలీజై సూపర్ సక్సెస్ అయ్యింది. హత్యా నేపథ్యంలో కొనసాగే ఈ మూవీలో విశాల్ డిటెక్టివ్ గా నటించాడు. హీరోయిన్ గా అను ఇమ్మానుయేల్ నటించింది. ఇక మరో హీరోయిన్ ఆండ్రియా ఈ మూవీలో నెగిటివ్ రోల్ పోషించింది. మిస్కిన్ ఈ చిత్రానికి దర్శకుడు. విశాలే తన సొంత ప్రొడక్షన్ హౌస్ లో ఈ చిత్రాన్ని నిర్మించాడు.
డిటెక్టివ్ మూవీకి తెలుగులో పాజిటివ్ బజ్ ఏర్పడింది. ఆ మధ్య విడుదలైన ధియేట్రికల్ ట్రైలర్ ఇక్కడ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేసింది. అలాగే విశాల్ కి ఇక్కడ మంచి మార్కెట్ కూడా ఉండటం కలిసొచ్చే అంశం. హీరోయిన్ గా నటించిన అను ఇమ్మానుయేల్ కి కూడా ఇక్కడ యూత్ లో ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈ డిటెక్టివ్ తో విశాల్ మరో హిట్ కొట్టే అవకాశం ఉందంటున్నాయి ట్రేడ్ వర్గాలు...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com