పేరడాక్స్ - సందర్భం : ఈ రోజు అక్టోబర్ విప్లవానికి శతమానం

పేరడాక్స్ -  సందర్భం : ఈ రోజు అక్టోబర్ విప్లవానికి శతమానం

 

వర్గ పోరాటం అని అరిస్తే 
వర్గీకరణ పోరాటాలు వచ్చాయి 
  మనువు నాలుగు కులాలు అంటే 
  మండల్ నాలుగు వందలు అన్నాడు 
  కుల మత వర్గ రహిత సమాజం అంటే 
  కులానికి ఒక కార్పొరేషన్ వచ్చింది 
  ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటే 
  ప్రపంచ బ్యాంకీకరణ ముంచుకు వచ్చింది 
  
 యుగం మారింది 
 జగము మారింది 
 తరాలు మారుతున్నాయి 
 తరలుతున్నాయి అమెరికాకు 
 రష్యా కు కాదు 
 చైనాకు కాదు! 
  
ఏకాధిపత్య ప్రపంచం 
కుంచుకుపోతోంది 
రివిజనిజమ్ 
రెక్కలు విచ్చుకుంది 
పశ్చిమ దిక్కు పరవసిస్తున్నది
  
తూర్పు సూర్యుడు 
తూర్పునే అస్తమించాడు.

వ్యాస పీఠం 
వ్యాకోచిస్తున్నది 

శాశ్వత అంతర్గత 
తిరోగమన ప్రతివిప్లవం.

(ప్రముఖ సీనియర్ న్యాయవాది,చిత్తర్వు సూర్యనారాయణ రావు,హైదరాబాద్)

Back to Top