అక్షయ్ కుమార్ హీరోగా చేసిన రిలీజ్ కు అడ్డుగా.. విలన్ గా చేసిన సినిమా.. !!

- November 08, 2017 , by Maagulf
అక్షయ్ కుమార్ హీరోగా చేసిన రిలీజ్ కు అడ్డుగా.. విలన్ గా చేసిన సినిమా.. !!

సినిమా రిలీజ్ పై ఇండస్ట్రీకి క్లారిటీ లేకపోవచ్చు గానీ, లీడ్ కాస్ట్ కే క్లారిటీ లేదంటే? ఆసినిమా రిలీజ్ పై యూనిట్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉందనేది అర్దం చేసుకోవచ్చు. 2.0 సినిమా రిలీజ్ పై లీడ్ యాక్టర్స్ కూడా డైలామాలోనే ఉన్నారు. అక్షయ్ కుమార్ అయితే రిపబ్లిక్ డేకు 2.0 వస్తుందా? తన పాడ్ మ్యాన్ ను రిలీజ్ చేసుకోవాలా? అనేది తేల్చుకోలేకపోతున్నాడు.
రోబో-2 జనవరి25న రిలీజ్ కాట్లేదు, సమ్మర్ కు వస్తోందని సౌత్ ఇండస్ట్రీలో ఓ టాక్ మొదలైంది. గ్రాఫికల్ వర్క్స్ బ్యాలెన్స్ ఉండడంతో ఈసినిమాను శంకర్ వాయిదా వేస్తున్నాడని టీనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే 2పాయింట్ ఓ టీం ఈ ప్రచారంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. సినిమా అనుకున్న టైంకే వస్తుందనిగానీ, పోస్ట్ పోన్ అవుతుందని గానీ ఏమీ చెప్పట్లేదు. దీంతో రోబో సీక్వెల్ రిలీజ్ పై డౌట్స్ ఎక్కువవుతూనే ఉన్నాయి.
శంకర్-రజనీకాంత్ కాంబినేషన్ లో 450కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమాలో అక్షయ్ కుమార్ నెగటివ్ రోల్ చేస్తున్నాడు. అక్కీ ఈసినిమాలో 12గెటప్స్ లో కనిపిస్తాడనే టాక్ వస్తోంది. సో అక్షయ్ ఈసినిమాలో నెగటివ్ హీరో. ఇక టు పాయింట్ ఓ లో నటిస్తూనే అక్షయ్ ప్యేడ్ మేన్ అనే సినిమాలో నటిస్తూ, నిర్మిస్తున్నాడు. ఈసినిమాను జనవరి26న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నాడు అక్షయ్ కుమార్.
జనవరి25న రోబో సీక్వెల్ వస్తే, వన్ డే గ్యాప్ తో ప్యాడ్ మేన్ రిలీజ్ అవుతుందా? అంటే కష్టమే. అలాగని ప్యాడ్ మేన్ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యిందా? అంటే అదీ లేదు. అంటే అక్షయ్ కుమార్ కూడా కన్ఫ్యూజన్ లోనే ఉన్నాడా? అంటే అవుననే అంటోంది యూనిట్. టు పాయింట్ ఓ రిలీజ్ డేట్ కోసమే అక్షయ్ కూడా వెయిట్ చేస్తున్నాడని, టుపాయింట్ ఓ జనవరి25న వస్తే పాడ్ మేన్ పోస్ట్ పోన్ అవుతుందని, ఒకవేళ టుపాయింట్ ఓ పోస్ట్ పోన్ అయితే ప్యాడ్ మేన్ జనవరి26న రిలీజ్ అవుతుందట. సో ఈ కన్యూజన్స్ అన్నింటిని చూస్తోంటే టు పాయింట్ ఓ రిలీజ్ డేట్ పై శంకర్ కూడా ఏం తేల్చుకోలేకపోతున్నాడని చెప్పొచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com