బిలియనీర్స్ క్లబ్‌ని ప్రారంభించనున్న ఇండీవుడ్
- November 09, 2017
డిసెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ జరగనుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న ఈ కార్యక్రమంలోనే బిలియనీర్స్ క్లబ్‌ని ప్రారంభించంచనున్నారు. భారతీయ మూలాలున్న 50 మంది బిలియనీర్లు, 400 మందికి పైగా ఇన్వెస్టర్లు ఈ బలియనీర్స్ క్లబ్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 1న లైమ్ లైట్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సోహాన్ రాయ్ నేతృత్వంలో ఇండీవుడ్ ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందుతోంది. బిలియనీర్స్ క్లబ్ గురించి సోహన్‌రాయ్ మాట్లాడుతూ, ఇన్వెస్టర్లను, ప్రముఖ వ్యాపారవేత్తలని, అలాగే కార్పొరేట్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవారికి ఇదొక చక్కని వేదిక అవుతుందని చెప్పారు. ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో పెట్టుబడులు పెట్టేందుకు వారందరినీ ఒకే వేదికపైకి తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉందని వివరించారాయన. ఐదేళ్ళలో ఇండీవుడ్ కన్సార్టియమ్ వెయ్యికి పైగా సినిమాల్ని రూపొందించనుందని చెప్పారు. సినిమా నిర్మాణాల సంఖ్య పరంగా ప్రపంచంలోనే అతి పెద్ద సినీ పరిశ్రమగా భారతీయ సినీ పరిశ్రమ వెలుగొందుతోందనీ ఏడాదికి 1500 నుంచి 2000 సినిమాల వరకు ఇక్కడ నిర్మితమవుతున్నాయని సోహన్ రాయ్ చెప్పారు. ఇండీవుడ్ ఫిలిం కార్నివాల్ రెండవ ఎడిషన్‌కి చీఫ్ గెస్ట్‌గా వ్యవహరించిన బీఆర్‌ఎస్ వెంచర్స్ ఛైర్మన్, ఎన్‌ఎంసి గ్రూప్ ఛైర్మన్ బిఆర్ శెట్టి, వెయ్యి కోట్ల విలువైన మహాభారత్ ప్రాజెక్టుని చేపడుతున్నట్లు ఆ ఈవెంట్‌లోనే ప్రకటించిన విషయం తెలిసినదే. డిసెంబర్ 1 నుంచి నాలుగు రోజులపాటు జరిగే ఇండీవుడ్ కార్నివాల్, 15 మేజర్ ఈవెంట్స్‌కి వేదిక కానుంది. 100 దేశాలకు చెందిన 250 సినిమాల్ని ప్రదర్శిస్తారిక్కడ. 300 మంది ఎగ్జిబిటర్స్, 5000 మంది ట్రేడ్ డెలిగేట్స్, 5000 మందికి పైగా పొటెన్షియల్ ఇన్వెస్టర్స్, 2500 మందికి పైగా ఇండీవుడ్ టాలెంట్ హంట్ ఫైనలిస్ట్‌లతో అత్యద్భుతంగా ఈ వేడుక జరగనుంది. గోల్డెన్ ఫ్రేమ్ అవార్డ్స్, రెడ్ కార్పెట్ మరియు నెట్‌వర్కింగ్ ఈవెంట్స్, ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్ లాంచెస్, ఫిలిం టూరిజం ఇన్వెస్టర్స్ మీట్, మీడియా ఇంటరాక్షన్స్, కాన్ఫరెన్సెస్ మరియు ప్యానెల్ డిస్కషన్స్, వర్క్‌షాప్స్ మరియు సెమినార్స్, ఫిలిం బిజినెస్ క్విజ్ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ
- టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన







