తెలుగులో డిజిటల్ పేమెంట్ కోసం గూగుల్ వారి 'తేజ్'
- November 09, 2017
డిజిటల్ పేమెంట్స్ ఊపందుకున్నాక పేమెంట్ యాప్ ల వాడాకం పెరిగింది. ఈ తరహా పేమెంట్లు ఒకప్పుడు పేటీఎం, ఫోన్ పే, ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమ్ యాప్ లు ఉన్నాయి. తాజాగా గూగుల్ కూడా ఓ యాప్ ప్రవేశ పెట్టింది. అదే తేజ్ యాప్. ఇది కేవలం మాటలతోనే పని ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దీనిని ఆడియో క్యూఆర్ అని పిలుస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఎంఐసీ, స్పీకర్ సాయంతోనూ చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ ఆడియో క్యూఆర్ టెక్నాలజీని గూగుల్ ఆవిష్కరించింది. ఇందులో జరిపే లావాదేవీల వివరాలను చాట్ రూపంలో తేజ్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రతిసారీ అకౌంట్ కు వెళ్లి ఎంత కట్టైంది అనే తెలుసుకునే పని లేకుండా... ఈజీగా తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇది దేశంలోని 55 బ్యాంకులతో అనుసంధానమైంది. దీనిలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
తేజ్ యాప్‌లో ఫస్ట్ మన అకౌంట్‌కు లింక్ చేసుకోవాలి. ఒకటికి మించి ఉన్నా సరే బ్యాంక్ ఖాతాకు యాడ్ చేసుకోవచ్చు. ఇందులో బ్యాంకింగ్ లేదా పేమంట్స్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ నుంచే వెళ్లిపోతుంది.
ఇందులో నుంచి ఇతరులకు డబ్బును క్రెడిట్ చేయవచ్చు...అలాగే పొందవచ్చు.
అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ తో చెల్లింపులు చేయడం దీని ప్రత్యేకత. దీనిని క్యాష్ మోడ్ గా నామకరణం చేసింది గూగుల్.
గతంలో ఎవరికైనా డబ్బులు పంపించాలన్నా...రిసీవ్ చేసుకోవలన్నా బెనిఫీషియరీగా అకౌంట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కానీ తేజ్ యాప్ లో ఫోన్‌లో ఉండే కాంటాక్ట్ నెంబర్ ద్వారా డబ్బులు పంపించవచ్చు....రిసీవ్ చేసుకోవచ్చు.
తేజ్ యాప్ లో ఉండే క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో యూజర్ అకౌంట్ కు సెక్యూరీటి ఎక్కువ.
సాధారణంగా యాప్ లన్నీ దాదాపు ఇంగ్లీష్ లోనే ఉంటాయి. దీంతో గ్రామీణ భారత దేశంలో యాప్ ల వాడకం తక్కువగా ఉంటుంది. దీనిని గుర్తించిన తేజ్ యాప్ యూజర్స్ కోసం ప్రాంతీయ భాషల్లోవాడుకునే విధంగా రూపకల్పన చేసింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, గుజరాతీ, బెంగాలి, మరాఠి ఇలా 9 భారతీయ భాషల్లో ఇంట్రడ్యూస్ చేసింది.
చివరిగా ఈ యాప్ ఉంటే డెబిట్ కార్డు చేతిలో ఉన్నట్టే. ప్రాంతీయ భాషల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈజీగా అయిపోయే ఓ వెసులుబాటు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!