చాటింగ్ లో రష్యా యువతే అపార్ట్‌మెంట్‌ లో ఆఫ్రికా అమ్మాయిగా మారిపోయింది

- November 09, 2017 , by Maagulf
చాటింగ్ లో  రష్యా యువతే  అపార్ట్‌మెంట్‌ లో ఆఫ్రికా అమ్మాయిగా మారిపోయింది

దుబాయ్: అమ్మాయే ..సన్నగా..... అర నవ్వే నవ్వలేదక్కడ.... మొబైల్ ఫోన్ లో చాట్ చేసిందని మతి తప్పిన ఓ కుర్రోడు మంచాన పడ్డాడు ..అరమరికలు లేకుండా బంగారు వర్ణంతో ..ధగధగా మెరిసిపోతున్న ఆ రష్యా అమ్మాయి అర్ధరాత్రి వరకు అడిగిన ప్రతి విషయానికి అనుకూలంగా ఠకీ ఠకీ మని మెసేజ్లు వెంట మెసేజ్ లు రెప్పపాటులో మొబైల్ కి వచ్చేస్తున్నాయి. ఆ యువకుడి సంతోషానికి అంతే లేదు.. ఓరోజు ఆ అపరిచిత మహిళ అపార్ట్‌మెంట్‌కు రావాలని ఆహ్వానించింది. అక్కడ ఒకరినొకరు కళ్ళ లోనికి చూసుకొంటూ కాలం కరగిస్తూ మాట్లాడుకొందాం..వస్తావు కదా ప్రియా అని ప్రేమపూర్వకంగా పిలవడంతో ఆ యువకుడు  పట్టరాని  సంతోషంతో కోరుకొన్న ఊహా సుందరిని కలవబోతున్నానని కేరింతలు కొట్టాడు. ఆమెని మరింత ప్రసన్నం చేసుకోవడానికి ఖరీదైన ఆభరణాలను ధరించి కారులో బయలుదేరి వెళ్లాడు. యూఏఈలోని దుబాయ్ నగరంలో ఆ మహిళ చెప్పిన అపార్ట్‌మెంట్‌ అడ్రెస్ కు చేసారుకోని   ఆనందంగా తలుపు కొట్టాడు. నల్లగా నిగనిగ లాడుతూ ఉన్న శరీరంతో  వత్తైన ఉంగరాల జుట్టుతో ఉన్న నైజీరియాకు చెందిన ఓ మహిళ తలుపు తెరచి సుస్వాగతం చెప్పింది  ‘‘నేను చాటింగ్ చేసింది ఎవరితో.. నాతో డేటింగ్ చేస్తానంది ఎవరు’’ అని ఆ యువకుడు ఆతృతగా ప్రశ్నించాడు. ‘‘నీతో చాటింగ్ చేసిన అమ్మాయి లోపల ఉంది’’ లోపలకి రమ్మని చెప్పడంతో  హమ్మయ్య ఈమె కాదులే..తాను వలచింది బంగారు బొమ్మేనని మనస్సుకి దైర్యం చెప్పుకొని కొండంత కోరికతో ఆ గదిలోకి  అడుగుపెట్టాడు. అంతలోనే వచ్చిన మరో నైజీరియన్ మహిళ తలుపుకి తాళం వేసింది. అంతే... వెను వెంటనే ఆ ఇద్దరు ఆఫ్రికా యువతులు కలిసి డబ్బులు..బంగారం ఇవ్వాలంటూ లోపలికి వచ్చిన యువకుడిని వేధించసాగాడు. వామ్మో నేనివ్వ అంటూ నిరాకరించడంతో వారు మరో గదిలో ఉన్న మరో ముగ్గురు కండలు తిరిగిన నైజీరియన్ యువకులకు  గోల్డ్ ఇవ్వడం లేదు చూడండి అంటూ గోముగా  పిలిచారు. అంతే వారు దూసుకువచ్చి ఆ చాటింగ్ బాబని చితకకొట్టారు. కిక్కురుమంటే చంపేస్తామని బెదిరించి అతడి పర్స్ లో ఉన్నబ్యాంక్ కార్డులను బలవంతాన లాక్కొన్నారు.  ఆ కార్డులను వుపయోగించి దాదాపు 1 లక్ష దిర్హమ్‌లను విత్‌డ్రా చేశారు. అనంతరం నిందితుడిని వదిలిపెట్టారు. దీంతో బతుకుజీవుడా అని బాధితుడు నేరుగా వెళ్లి  పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు నైజీరియా  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలోని ఓ యాప్‌లో ఖాతా తెరిచి ఓ అందమైన అమ్మాయి ఫోటోతో బాధితుడిని నమ్మించి చాటింగ్ చేశారని, అపార్ట్‌మెంటుకు రావాలని ఆహ్వానించారని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు వెల్లడించారు. బాధితుడు యూరోప్ దేశానికి  చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసుపై కోర్టులో విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. రష్యా అమ్మాయితో తనకు పరిచయమైందని, తనకు ఫోన్ నంబర్ ఇచ్చిందని, ఇద్దరి మధ్య స్నేహం పెరగడంతో ఆమె ఆహ్వానం మేరకు అపార్ట్‌మెంట్‌కు వెళ్లాలని గుడ్లనీరు కుక్కుకొంటూ విలేకరుల ముందు వాపోయాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com