మహిళల భద్రతపై పలు చర్యలు చేపట్టిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం
- November 09, 2017
భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతపై పలు చర్యలు చేపట్టింది. ప్రతి సోమవారం మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. మహిళల భద్రతపై జరిగిన ఉన్నతస్ధాయి భేటీ అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు అర్ధరాత్రి సైతం రోడ్లపై ధైర్యంగా సంచరించే వాతావరణం నెలకొనాలని దీనికి పోలీసులు పూర్తి బాధ్యత తీసుకోవాలని చౌహాన్ ఆదేశించారు.
మహిళల భద్రతను పెంచేందుకు అన్ని బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని సీఎం సూచించారు.దీనికి తోడు బాలికల పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు.
స్కూల్ బస్సుల డ్రైవర్లు, ఆపరేటర్ల పోలీస్ వెరిఫికేషన్‌ను పూర్తిచేయాలని కోరారు.మహిళా రక్షణ చట్టాలపై విరివిగా ప్రచారం చేయాలని అధికారులను కోరారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష